భారత దేశ వ్యాప్తంగా విడుదలైన ఏం.ఎస్ ధోని చిత్రం ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి తన అభిమానులకు అతిపెద్ద ట్రీట్ ఇచ్చింది. ఈ చిత్రంలో ధోని పుట్టిన దగ్గర నుండి అతడు గొప్ప క్రికెటర్ గా ఎదిగి... క్యాప్టెన్ బాధ్యతలు స్వీకరించి... ఇండియా కి వరల్డ్ కప్ సంపాదించి అందరి చేత ప్రశంసలు దక్కించుకున్న సంఘటనలను చూపించారు. ధోనికి ఒక అమ్మాయితో పరిచయం, ఆ పరిచయం ప్రేమ, ఆ ప్రియురాలు చనిపోవడం వంటి తెలియని విషయాలు కూడా ఈ చిత్రంలో చూపించబడ్డాయి. దర్శకుడు నీరజ్ పాండే గొప్ప క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా స్థాయిలో తీయలేక చతికిలబడ్డాడు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. క్రికెట్ పై ఎంఎస్ ధోని ఎలా ఆసక్తి పెంచుకున్నాడో... రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎంపిక అయ్యేందుకు తాను పడిన కష్టాలను ప్రత్యక్షంగా చూపించాడు నీరజ్. 


ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూపర్ గా నటించాడు అని చెప్పుకోవచ్చు. చాలా చురుకుగా అచ్చం ధోనిని చూస్తున్నట్లు ఫీలింగ్ వచ్చేలా సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించి విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జీవించేసాడు. ధోని ప్రియురాలి పాత్రలో నటించిన దిశాపటానికి నటన పరంగా బాగానే మార్కులు పడ్డాయి. వీళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలను ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహంతో చూసి వారి మనసులను పులకరించుకున్నారు. మనకి బాగా సుపరిచితురాలైన భూమిక చావ్లా ధోని అక్క పాత్రలో నటించింది. 


ఈ సినిమాలో ధోనీ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు అంత ఈ విధంగా ప్రాముఖ్యత ఇస్తూ చూపించలేదు. సెకండాఫ్ లో ఇంతలోనే కెరియర్ గురించి చక్కగా చూపించేసి మమ అనిపించి చేశారు. ఏదేమైనా భారతదేశ సినీ చరిత్రలో మొట్టమొదటిగా ఒక క్రికెటర్ జీవిత చరిత్ర గురించి తెరకెక్కించే ట్రెండ్ సెట్ చేశాడు దర్శకుడు నీరజ్ పాండే.

మరింత సమాచారం తెలుసుకోండి: