30 సినిమాలకు పైగా ఎన్నో హాస్యభరితమైన పాత్రలలో నటించి... శంభో శంకర చిత్రం ద్వారా కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన శకలక శంకర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఆర్థిక స్తోమత లేక కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న షకలక శంకర్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి తో హైదరాబాద్ కి వచ్చి ప్రముఖ నటీమణి నిర్మల వద్ద పనిచేసి... సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని క్రమక్రమంగా జబర్దస్త్ షోలో చలాకి చంటి బృందంలో హాస్యనటుడిగా జాయిన్ అయ్యాడు. 


ఆ తర్వాత మెల్ల మెల్లగా తానే స్వయంగా షకలక శంకర్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసే జబర్దస్త్ లో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగాడు. ఆ తర్వాత ఈ శ్రీకాకుళం అబ్బాయి తన టాలెంట్ ను చూపిస్తూ... సినిమాల లో వరుసగా అవకాశాలను సంపాదించడం ప్రారంభించాడు. చివరికి తాను జబర్దస్త్ కి స్వస్తి చెప్పి సినిమాలకే పరిమితం అయ్యాడు. అయితే ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు సన్నగిల్లి పోయాయని మళ్ళీ తను జబర్దస్త్ షో లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని విశ్వసనీయ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. 


ఈ విపత్కర సమయాలలో చిత్ర షూటింగ్ లు నిర్విరామంగా జరగడం దాదాపు అసాధ్యం కాగా... చిన్నపాటి నటులంతా ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇదే తరహాలో షకలక శంకర్ కూడా జబర్దస్త్ షో లో నటిస్తూ డబ్బులు సంపాదించాలని భావిస్తున్నాడు. మరోవైపు జబర్దస్త్ షోలో అనేకమైన మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏడు సంవత్సరాల పైగా జబర్దస్త్ లో కొనసాగిన రష్మీ, అనసూయ లను షో నుండి తీసివేస్తున్నట్టు మంజుషా, విష్ణుప్రియలను కొత్త యాంకర్లాగా పెట్టుకున్నట్టు సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందుతుంది. అలాగే షకలక శంకర్ టీం తో పాటు తాగుబోతు రమేష్ తో ఒక సరికొత్త టీమ్ ని జబర్దస్త్ లో చూడబోతున్నామని తెలుస్తోంది. సత్తిపండు, ఫసక్ శశి టీంలు ఇక ఉండబోవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: