టాలీవుడ్ లో కొరటాల శివకి ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. కొరటాల శివ తో సినిమా చేయడానికి గానూ అగ్ర హీరోలు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఆచార్య అనే సినిమాను చిరంజీవి హీరోగా తీసుకొస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమా మీద స్పష్టత లేదు. 

 

 

సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. కాని ఇప్పుడు రామ్ చరణ్ తో కాదు అతను మంచు మనోజ్ తో ఒక ప్రాజెక్ట్ ని ఓకే చేసాడు అని సమాచారం. మంచు మనోజ్ ఎప్పటి నుంచో ఒక్క మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అతనికి ఒక సరైన సినిమా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి మరి. మ‌నోజ్ ఇటీవ‌ల సినిమాకు బాగా ల్యాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ స్టార్ట్ చేశాడు.

 

 

అందుకే ఇప్పుడు ఒక మంచి సినిమా కోసం గానూ అతను కొరటాల శివ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడు అని అంటున్నారు జనాలు. కొరటాల శివ తో ఒక సినిమా చేసి అది హిట్ అయితే కెరీర్ మళ్ళీ ఊపు అందుకునే అవకాశం ఉంది అని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్. అయితే కొర‌టాల ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చిరుతో ఆచార్య కంప్లీట్ చేశాక మ‌నోజ్ సినిమా చేస్తాడా ?  లేదా చ‌ర‌ణ్‌కు క‌మిట్ అవుతాడా ? అన్న‌ది చెప్ప‌లేం.

మరింత సమాచారం తెలుసుకోండి: