టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే రమ్యకృష్ణ కు చాలా తక్కువ కాలంలో మంచి పేరు వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే. ఏ పాత్రలో అయినా సరే ఆమె ఉంటే ఆ పాత్రకు అందం వస్తుంది అనే విధంగా ఆమె నటన ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఏ సినిమాలో అయినా సరే ఆమెను కీలక పాత్రలకు తీసుకునే విధంగా ఆమె తన నటన తో ప్రేక్షకులను మెప్పించారు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో చాలా వరకు బిజీ గా ఉన్నారు. ఇక ఆమెకు కొన్ని కొన్ని పాత్రలు కూడా క్యూ కడుతూ వస్తున్నాయి. 

 

ఆమె సినిమాల్లో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడుతూ ఉంటాయి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెను ఒక కీలక రోల్ లో తీసుకోవాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆమెకు ఒక మంచి పాత్ర ఇచ్చే ఆలోచన జక్కన్న చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర ఉందని ఆ పాత్రకు ఆమె అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయం చిత్ర యూనిట్ కూడా చెప్పింది అని అందుకే ఆయన ఆ పాత్రకు గానూ ఆమెను ఎంపిక చేసాడు అని సమాచారం. 

 

ఆమెకు కూడా ఇపటికే దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చారు అని ఆమె అందుకు ఓకే చెప్పారు అని సమాచారం.  ఆమె త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పాత్రలో ఆమె ఏ విధంగా కనపడతారు అనేది చూడాలి. ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్ కూడా లైన్ లో ఉందని కాని ఆమె ఆలోచించి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు మరి టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: