అగ్ర హీరోల నుంచి ఏదైనా చిన్న ప్రకటన వస్తే చాలు అభిమానులకు ఒకరకంగా పండగ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏది అయినా ఎవరి తో సినిమా చేస్తున్నా సరే అగ్ర హీరోల సినిమాల మీద గాని వారి మీద వచ్చే వార్తల మీద గాని జనాలకు ముందు నుంచి కూడా ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అగ్ర హీరోలు అందరూ కూడా వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ గా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరి నుంచి ఒక్క మంచి ప్రకటన వచ్చినా సరే చాలు అనుకునే విధంగా ఉంది టాలీవుడ్ లో అభిమానుల పరిస్థితి అనేది వాస్తవం అని చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు మన తెలుగులో ఎన్టీఆర్ సినిమాలకు ఎక్కడ లేని క్రేజ్ ఉంది. బాబు ఏ సినిమా చేసినా సరే జనాలకు పైకి చెప్పలేని ఉత్సాహం. మన తెలుగులో ఈ స్థాయిలో ఇంత తక్కువ కాలంలో స్టార్ హీరోగా ఇంత క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరూ కూడా లేరు అనేది వాస్తవం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ వెబ్ సీరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు అనే ప్రచారం కొన్ని రోజులు గా జరుగుతూ వస్తుంది. వెబ్ సీరీస్ కి సంబంధించి అతను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అని అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ వెబ్ సీరీస్ వస్తుంది అని అంటున్నారు. 

 

అయితే ఈ వెబ్ సీరీస్ విషయంలో ఇప్పుడు ఒక ప్రకటన వచ్చింది. దీనిని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏమీ లేదు ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పట్లో అయ్యే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదుమరి. అందుకే ఇప్పుడు వెబ్ సీరీస్ మీద ఫోకస్ చేసాడు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: