టాలీవుడ్ లో చాలా వరకు ఖర్చు తగ్గిస్తున్న సంగతి తెలిసిందే. ఏ హీరో సినిమా అయినా సరే ఖర్చుల విషయంలో ఇప్పుడు రాజీ పడే పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరిగా స్వేచ్చగా సినిమా కోసం ఖర్చు చేసే పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. అది ఏ హీరో సినిమా అయినా సరే అదే విధంగా ముందుకు వెళ్ళడం మినహా మార్గం అయితే లేదు అనే మాట అక్షరాలా నిజం. అందుకే ఇప్పుడు నిర్మాతలు ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి స్టార్ హీరోల సినిమాల్లో నటీ నటులను ఎంపిక చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. హీరోయిన్ లు అయినా సరే అదే విధంగా ఆలోచిస్తున్నారు. 

 

ఇప్పుడు వస్తున్న ఒక వార్త ఏంటీ అనేది ఒకసారి చూస్తే... మన తెలుగులో పాత హీరోయిన్ లను దాదాపుగా కొన్ని రోజులు పక్కన పెట్టి వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం  మంచిది అని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ విషయంలో మాత్ర౦ అదే విధంగా ముందుకు వెళ్ళాలి అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రగతి లాంటి వాళ్లకు కూడా భారీగా రేటు తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని జయ సుధా విషయంలో కూడా ఇప్పుడు ఆలోచించి ఓకే చెప్పాలి అని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఏయే వారికి ఈ విధంగా చెప్తారు అనేది చూడాలి. 

 

చిన్న హీరోల సినిమాల్లో అయితే తక్కువ రేటు కి చేసే వారిని మాత్రమే తీసుకోవాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎంత తక్కువ ఖర్చు లో సినిమా పూర్తి అయితే అంతే తక్కువ ఖర్చులో సినిమా చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో ఎవరికి ఏ విధంగా షాక్ తగులుతుంది అనేది చూడాలి. ప్రస్తుతం ఎవరికి అయిన యింతే...

మరింత సమాచారం తెలుసుకోండి: