సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలు ఒకటి రిలీజ్‌ అవుతుంటే మరో సినిమా పోటి లేకుండా జాగ్రత్త పడతారు. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆడియన్స్‌ షేర్ అవుతారని కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందని భావిస్తారు. అందుకే కాస్త అటూ ఇటు అయినా పరవాలేదని స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌ ల మధ్య కనీసం వారం అయినా గ్యాప్‌ ఉండేలా చూసుకుంటారు.

 

అలాంటి ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే. అది కూడా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్‌ ఉన్న హీరో సినిమాలు రిలీజ్‌ అయితే ఎలా ఉంటుంది. నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏ సినిమా హిట్‌ అవుతుంది. ఏ సినిమా ఫట్‌ అవుతుంది అన్న విషయం ఎవరూ అంచనా వేయలేరు. అభిమానులు ఏ సినిమాకు మద్దతుగా నిలుస్తారు అన్న విషయాన్ని కూడా ఎవరూ చెప్పలేరు.

 

అలాంటి అరుదైన సాహసం 1993లో చేశాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య హీరోగా తెరకెక్కిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజున రిలీజ్‌ అయ్యాయి. 1993 సెప్టెంబర్ 3న ఈ సాహసం చేశాడు బాలయ్య. అప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వాయిదా పడ్డ నిప్పురవ్వతో పాటు రెగ్యులర్‌గా రిలీజ్‌కు రెడీ అయిన బంగారు బల్లోడు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేశాడు.

 

వీటిలో నిప్పురవ్వ సినిమా సోషల్ మేజేజ్‌తో ఉన్న యాక్షన్‌ డ్రామాగా కాగా, బంగారు బుల్లోడు సరదాగా సాగిపోయే ఫ్యామిలీ డ్రామా ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు సినిమాకే అభిమానులు ఓటేశారు. దీంతో నిప్పురవ్వ సినిమాకు మంచి పేరు వచ్చినా బంగారు బుల్లోడు సూపర్‌ హిట్ అయ్యింది. ఈ రికార్డ్ చాలా కాలం పాటు అలాగే నిలిచిపోయింది. కానీ ఇటీవల నాని లాంటి ఒకరిద్దరు హీరోలకు నిర్మాతలతో వివాదాల కారణంగా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: