వెండితెరపై వెలుగులు నింపిన సినిమాలెన్నో ఉన్నాయి. అటువంటి వెలుగులకు కారణమైన దర్శకులు కూడా ఎందరో ఉన్నారు. తమ ప్రతిభతో తెలుగు సినిమాకు దేశంలో, ప్రపంచంలో గుర్తింపు తెచ్చారు. అటువంటి మేటి దర్శకుల జాబితాలో ముందువరుసలో ఉండే దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా ఏది టచ్ చేసినా తన మార్క్ సినిమాగా ముద్ర పడిపోవాల్సిందే. జంధ్యాల శిష్యుడిగా ఆయన తర్వాత కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు ఎన్నో గొప్ప సినిమాలు తీసి.. తెలుగు సినిమా వైభవాన్ని పెంచిన ఈవీవీ జయంతి నేడు.

IHG

 

ఆయనకు కథ మాత్రమే ముఖ్యం. ఆ కథకు మాస్, క్లాస్, ఫ్యామిలీ, కామెడీ.. జోనర్లలో ఏది నప్పుతుందో దానిని జొప్పించగల నేర్పరి. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తీసిన సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. తొలి సినిమా చెవిలో పువ్వు ఫ్లాప్ ఇచ్చారు ఈవీవీ. కానీ ఆయన టాలెంట్ గుర్తించి పిలిచి సినిమా ఇచ్చారు డి.రామానాయుడు. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నారు ఈవీవీ. తన పవర్ ఏంటో.. తెలుగు సినిమాకు భవిష్యత్తుకు తన అవసరం ఉందో నిరూపించుకున్న ఆ సినిమానే ‘ప్రేమఖైదీ’. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తో వెనుతిరిగి చూడని ఈవీవీ కెరీర్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు.

IHG

 

కామెడీల్లో.. జంబలకిడిపంబ, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, మాస్ లో హలో బ్రదర్, అల్లుడా మజాకా, సెంటిమెంట్ లో ఆమె, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, లవ్ లో ప్రేమఖైదీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. ఇలా ఆయన ప్రతిభకు నిదర్శనాలెన్నో. హిందీ రాకపోయినా అమితాబ్ తో హిందీ సినిమా తీసిన టాలెంట్ ఆయన సొంతం. నేడు ఆయన మనమధ్య లేకపోయినా.. తన కామెడీతో ప్రతిరోజూ నవ్విస్తూనే ఉంటారు.  

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: