అక్కినేని వారసుడు టాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ అరుదైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ రోజు తమ అమ్మా నాన్నల పెళ్లి రోజు సందర్భంగా వారి పెళ్లి ఆల్బమ్‌లోని కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల, సత్య భూషణ్‌ రావుల కొడుకు సుశాంత్‌. 2008లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇంకా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

 

రోజు వాళ్ల అమ్మానాన్నల పెళ్లి రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. పెళ్లి వేడుకలో సందడి చేస్తున్నా ఏ ఎన్‌ ఆర్, పెళ్లి హాజరైన ఎన్‌ టీ ఆర్‌, ఇతర ప్రముఖులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రతీ ఏటా ఇలా కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తానంటూ కామెంట్ చేశాడు సుశాంత్.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుశాంత్ ప్రస్తుతం ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే డిఫరెంట్ టైటిల్‌లో ఓ సినిమా ను ప్రారంభించాడు. అయితే ఈ సినిమా ప్రారంభమైన వెంటనే లాక్‌ డౌన్‌ విధించటంతో షూటింగ్ వాయిదా పడింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy anniversary Amma & Nanna! Thank You for this life 🤗❤️ Was going through your wedding album and found so many priceless pictures! Will post a few every year 🙏

A post shared by sushanth A (@iamsushanth) on

మరింత సమాచారం తెలుసుకోండి: