శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా సినిమాలలో ప్రత్యేకంగా ఐటెం సాంగులు పెట్టడం.. వాటిలో పేరున్న తారలను నటింపజేయడం మన చూస్తున్నాం. వాస్తవానికి చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించిన విషయం తెలిసిందే.  ప్రముఖ హీరోయిన్లు సైతం ఈ పాటల్లో మనకు కనిపిస్తూ, వినోదాన్ని పంచుతున్నారు.

 

మంచి పారితోషికం ఇవ్వడం.. పైగా మూడు నాలుగు రోజుల్లోనే పాట చిత్రీకరణ పూర్తికానుండడం వల్ల స్టార్ హీరోయిన్లు వీటికి మొగ్గుచూపుతున్నారు.  దీంతో కేవలం డబ్బు కోసమే తమన్నా ఇలా ఐటెం పాటల్లో నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.  తాజాగా ఈ విషయం పై తమన్నా స్పందించింది. 'నాకు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, నాకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం.

 

ఇలాంటి పాటల్లో అయితే నా డ్యాన్స్ స్కిల్స్ ను ప్రేక్షకులకు మరింతగా చూపించగలుగుతాను. పైగా, ఇంతకు ముందు పనిచేసిన హీరోలతో మళ్లీ చేసే అవకాశం కూడా వీటి వల్ల వస్తుంది. అంతేకానీ, అందరూ అనుకుంటున్నట్టు వేరే కారణాల వల్ల మాత్రం కాదు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా అంటుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక పుకార్లు మాన్ అంటూ కొట్టి పడేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: