సినిమా లకు కమర్షియల్‌ మార్కెట్ పెంచింది మాస్ సినిమాలే. అప్పటి వరకు సామాజిక అంశాలు, పౌరాణిక గాధలు మాత్రమే సినిమా కథలుగా ఉన్న సమయంలో యాక్షన్ కథలను తెర మీదకు తీసుకువచ్చి హీరోయిజానికి పెద్ద పీట వేశారు. ఒకరకంగా మాస్‌ సినిమాల ట్రెండ్‌ మొదలైన తరువాత హీరో లకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ మొదలైంది.

 

అయితే 60ల లోనే తెలుగు సినిమాకు కమర్షియల్ ఫార్మాట్‌ ను అలవాటు చేసిన దర్శకుడు కే యస్ ‌ఆర్‌ దాస్. కృష్ణ కు సూపర్ స్టార్ ఇమేజ్‌ రావటం వెనుక కేయస్ ఆర్‌ దాస్‌ కృష్టి ఎంతో ఉంది. 66లో లోగుట్టు పెరుమాళ్ళుకెరుక సినిమాతో దర్శకుడి గా పరిచయం అయ్యాడు కేయస్‌ ఆర్‌ దాస్‌. ఆ తరువాత రాజయోగం, రాజ సింహ, గండరగండడు లాంటి జానపద చిత్రాలను తెరకెక్కించాడు.

 

ఆ సమయం లోనే హాలీవుడ్ సినిమాల ఇన్సిపిరేషన్‌ తో టక్కరిదొంగ చక్కని చుక్క లాంటి సినిమాతో కమర్షియల్‌ ట్రెండ్‌ తీసుకున్నాడు. మాస్ సినిమాలు చేస్తూనే బంగారు కుటుంబం లాంటి ఫ్యామిలీ డ్రామాలు కూడా చేశాడు దాస్. ఇక ఇండియన్‌ స్క్రీన్ మీద తొలి బాండ్ సినిమా జేమ్స్‌ బాండ్‌ 777ను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు దాస్‌. అంతేకాదు తొలి కౌబాయ్ మూవీ మొసగాళ్ల కు మోసగాడు సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దాసే.


సినిమా మేకింగ్‌ లోనే కాదు సినిమా టైటిల్స్ ‌లోనూ తన మార్క్ చూపించాడు దాస్‌. గండరగండడు, మొసగాళ్లకు మోసగాడు, కత్తుల రత్తయ్య, దొరలు దొంగలు లాంటి ఊర మాస్ టైటిల్స్‌తో సినిమాలు చేశాడు. కెరీర్ ‌లో ఎక్కువగా మాస్  సినిమాలు మాత్రమే చేసిన దాస్ 2000 సంవత్సరంలో చివరగా నాగులమ్మ సినిమాను రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: