ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి ఉంటే మనిషి ఏదైనా సాదించగలరని నిరూపించిన వ్యక్తి. నాటి నుండి నేటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయుడిగా రాణిస్తున్న వ్యక్తి. నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తూన్నారు. ఇతని స్ఫూర్తితోనే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. 

 

 

కొత్త ఒరవడికి నాంది పలికిన ఆ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. బాడీలో స్ప్రింగులు పెట్టుకున్నాడ అనేలా చేసిన డాన్సులు కుర్రకారుని ఉర్రూతలూగించాయి. తెలుగు సినిమాకు బ్రేక్ డాన్సులను పరిచయం చేసింది చిరంజీవి గారే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. 

 

 

1978లో 'ప్రాణం ఖరీదు'తో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి, 1983లో వచ్చిన 'ఖైదీ'తో స్టార్‌గా మారారు. అప్పట్నుంచీ ఒక దశాబ్ద కాలం ఆయనకు తిరుగనేదే లేకుండా పోయింది. ఈ మధ్యలో ఆయన మెగాస్టార్‌గా కూడా బాక్సాఫీసును అనేక సార్లు బద్దలు కొడుతూ వచ్చారు.

 

 

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘ముఠామేస్త్రి’ ఒకటి. అంతేకాదు.. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆఖ‌రి సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. కూరగాయల మార్కెట్‌లో ఉండే ఓ మేస్త్రి… పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. చిరంజీవికి జోడీగా మీనా, రోజా న‌టించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, గుమ్మడి, మన్సూర్ అలీ ఖాన్, శరత్ సక్సేనా, కోట శ్రీనివాసరావు, జె.వి.సోమయాజులు, యువరాణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు.

 

 

ఈ సినిమాని కామాక్షి దేవీ కమల్ కంబైన్స్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రాజ్-కోటి స్వరసారధ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ పాట బాగా పాపులర్ అయింది. అలాగే.. ‘ఎంత ఘాటు ప్రేమయో’, ‘అంజనీ పుత్రుడా’, ‘జోరుగున్నాది’, ‘చికిచికి చామ్‌’ పాటలు కూడా మాస్ ప్రేక్షకులను అలరించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: