టాలీవుడ్ లో బాలయ్య సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే  ఆయన సినిమా కోసం టాలీవుడ్ లో కూడా ఎదురు చూస్తారు. ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 5 రోజులు మాత్రమే జరుపుకుంది. అయినా సరే ఈ సినిమా టీజర్ మాత్రం ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది అనేది చెప్పవచ్చు. సినిమా టీజర్ చూసి జై బాలయ్య అని టాలీవుడ్ లో జనాలు కూడా అన్నారు అనేది తెలిసిందే. 

 

ఇక అది పక్కన పెడితే ఈ సినిమా గురించి ఒక వార్త వచ్చింది. అది ఏంటీ అంటే... ఈ సినిమాలో బాలకృష్ణ గ్రామ సర్పంచ్ గా నటిస్తున్నారు అని సమాచారం. ఆయన  మూడు ఊళ్లకు సంబంధించిన ఒక పంచాయితి కి సర్పంచ్ అని అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే గా వెళ్తారు అని సమాచారం. దీనికి సంబంధించిన కథ లో కొన్ని మార్పులు ఉన్నాయి అని అంటున్నారు. లేదా ఆయన ఈ సినిమాలో ఒక భారీ రైతు అని కూడా అంటున్నారు. ఆ విధంగానే సినిమా టీజర్ ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమా కథ విషయంలో మాత్రం ఇప్పుడు చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. 

 

ఎందుకు కథ మారుస్తున్నారు అనేది తెలియదు గాని బాలయ్య మాత్రం ఆ విధంగా సూచనలు చేసారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో. ఈ సినిమా తర్వాత బాలయ్య బీ గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే సూచనలు ఉన్నాయి అని సమాచారం. చూడాలి మరి ఏ సినిమానో...

మరింత సమాచారం తెలుసుకోండి: