కరోనా లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ పడుతున్న కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమను ఆదుకోవడానికి ఎవరు ఏ విధమైన చర్యలు చేపట్టినా సరే అది ఇప్పట్లో కోలుకునే అవకాశాలు మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు సినీ పరిశ్రమ దివాలా తీసే పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా సరే ఇప్పట్లో షూటింగ్ లు జరిగే అవకాశాలు కూడా దాదాపుగా కనపడటం లేదు. 

 

అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే... కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే సూచనలు ఉన్నాయి. సినీ కార్మికుల కోసం కేంద్రం ముందుకు రావాలి అని సినీ పరిశ్రమతో కలిసి వారిని ఆదుకోవాలి అని అదే విధంగా సినిమా టికెట్ ధరలకు సంబంధించి దేశం మొత్తం ఒకే విధానం ఉండే విధంగా చూడాలి అని కేంద్రాన్ని కోరే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. బాలీవుడ్ పెద్దలతో మన తెలుగు హీరోలు తమిళ హీరోలు అందరూ కూడా దీని మీద చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తుంది. కేంద్రం సహకారంతో ఇప్పుడు ఈ విషయంలో ముందుకు అడుగు వెయ్యాలి అని భావిస్తున్నారు. 

 

అంతే కాకుండా సినీ కార్మికులకు సంబంధించి ఒక పెన్షన్ స్కీం ని కూడా అడుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాలీవుడ్ సినీ పెద్దల తో టాలీవుడ్ పెద్దలు మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.  కాగా ఇప్పటికే సినీ కార్మికులకు పెద్ద ఎత్తున సినీ పెద్దలు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: