భారీ సినిమాల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన మాక్ షూట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ సినిమాల షూటింగ్ అంటే కనీసం రెండువదలకు పైగా జనం అవసరం అవుతారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 50మంది యూనిట్ సభ్యులతో ‘ఆర్ ఆర్ ఆర్’ మాక్ షూట్ ను ఎలా చేయగలడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉంది.   


తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఈ మాక్ షూట్ ను రేపు చేస్తాడని అలా షూట్ చేసిన ఫుటేజ్ ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇరు ప్రభుత్వాలకు పంపుతాడని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ ల విషయంలో విడుదలచేసిన నియమ నిబంధనలను పాటిస్తూ సినిమాలు షూట్ చేయడం అసాధ్యం అని అందరు భావిస్తుంటే రాజమౌళి మైండ్ లో ఈవిషయమై ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖ దర్శకులు నిర్మాతలు ఈ మాక్ షూట్ కు హాజరు అవుతారని టాక్. 


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ సినిమా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అనుసరిస్తూ షూటింగ్ నిర్వహించడంలో అనేక ప్రాక్టికల్ సమస్యలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఇలాంటి భారీ సినిమాల నిర్మాణానికి ప్రభుత్వ నియమ నిబంధనలు కొంతవరకు మారాలని కోరుతూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరబోతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఇలా ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ కంటే ముందుగానే దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాణంలో దర్శకుడు రవిబాబు తీస్తున్న ఒక చిన్న సినిమా షూట్ ను కేవలం 20 మందితో తీయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 


వాస్తానికి సినిమాల నిర్మాణం ఏదోవిధంగా పూర్తి చేసినా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్యలో ఇండియా ప్రపంచం దేశాలలో నాల్గవ స్థానానికి చేరుకొని కలవరం సృష్టిస్తున్న పరిస్థితులలో ఇంత కష్టపడి సాహసంతో సినిమాలు పూర్తి చేసినా ధియేటర్లు ఓపెన్ కాకుండా సినిమాలు పూర్తి అయితే ఎవరికీ ప్రయోజనం అంటూ ఇండస్ట్రీలో లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: