సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీ లలో సూపర్‌ హిట్‌ లు అందించిన సినిమా జానర్‌ హరర్‌ కామెడీ. అప్పటి వరకు ఉన్న కామెడీ చిత్రాల కు భిన్నంగా నవ్విస్తూ భయపెట్టే ట్రెండ్‌ ఒక టైం సూపర్‌ హిట్ అయ్యింది. తెలుగు లోనూ ఈ తరహా సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సౌత్ లో ఈ తరహా సినిమాల ట్రెండ్ చాలా కాలమే సాగింది. అయితే తన కెరీర్‌ లో ఎక్కువగా ఇలాంటి సినిమా లే చేశాడు ఓ స్టార్‌.

 

హీరో మరెవరో కాదు డాన్స్‌ మాస్టర్‌ గా కెరీర్‌ ప్రారంభించి హీరో గా, దర్శకుడి గా మారాడు లారెన్స్‌ రాఘవేంద్ర. ముని సిరీస్ తో హరర్‌ కామెడీ ల వైపు అడుగులు వేశాడు లారెన్స్‌. ముని సినిమా ఘన విజయం సాధించటం తో వరుసగా అదే జానర్‌ సినిమాలను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఆ సీరిస్‌ లో నాలుగు సినిమాలు రూపొందించగా అన్ని సినిమాలు సూపర్ హిట్‌ అయ్యాయి. కేవలంం ముని సిరీస్‌ మాత్రమే కాదు పీ వాసు దర్శకత్వంలో శివగంగ లాంటి సినిమాల్లో కూడా నటించాడు లారెన్స్‌.

 

అంతే కాదు ఆ సినిమాను తెలుగు లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముందు కూడా ఈ సిరీస్‌ ను కొనసాగిస్తానని చెపుతున్నాడు లారెన్స్‌. అంతేకాదు ఆ సిరీస్‌ లో సూపర్ హిట్ అయిన కాంచన సినిమా ను ఇప్పుడు బాలీవుడ్‌ లోనూ రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వం లోనే ఈ సినిమా రూపొందుతుంది. లక్ష్మీ బాంబ్ పేరు తో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: