టాలీవూడ్ హీరోలో కామెడీ, ఎనర్జీని ప్రేక్షకులకు పంచే హీరో రామ్. అందుకే అతనికి ఎనర్జిటిక్ హీరో అనే స్టార్ డాంని తెచ్చుకున్నాడు. అయితే  టాలీవుడ్ హీరో రామ్ పోతినేని జగడం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ మధ్య సరైన సినిమాలు లేని రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ సినిమా చేస్తున్నాడు. 

 

 

అయితే రామ్ ఏదైనా సినిమాలో నటించాడు ఉంటే అందులో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎనర్జీ కూడా నింపుతాడన్న విషయం అందరికి తెలిసిందే. డాన్సులో  నటనలో యాక్షన్ లో ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు రామ్. రామ్ హీరోగా నటించిన సినిమాల్లో అన్ని ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్  ప్రేక్షకులకు పంచుతూ ఉంటాడు.

 

 

ఇక రామ్ సినిమాలో కమెడియన్స్ తో కలిసి రామ్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కామెడీతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దాదాపుగా ఇప్పటివరకు రామ్ నటించిన అన్ని సినిమాలు ఇలా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

రామ్ చేసిన ప్రతి సినిమాలో కామెడీ టైమింగ్స్ పిక్స్ లో ఉంటాయి. ఒక్క వైపు కామెడీ పండిస్తూనే మరో వైపు తన హీరోయిజాన్ని ప్రేక్షకుల ముందు ఉంచుతాడు. అటు మాస్ ని ఇటు క్లాస్ ను రెండిటిని ఒక్కే టైములో పండించగల సత్తా గల హీరో. తనదైన  కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 

 

ఎలాంటి సన్నివేశంలో నైనా తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తాడు రామ్. ఎలాంటి కమెడియన్ తో  అయినా బెస్ట్ జోడి అనిపించుకుంటారు. అద్భుతమైన నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరిలో  సరికొత్త ఎనర్జీని నింపుతూ  ఉంటాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: