ప్యాలెస్ లు అనగానే రాజుల కాలం నాటి చరిత్రను గుర్తుకు చేస్తుంటాయి. ప్యాలెస్ అనే మాట వింటే రాజభోగాలను గుర్తు చేస్తాయి. అలాంటి చరిత్ర కలిగిన ప్యాలెస్ మన బాలీవుడ్ హీరోలో ఒక్కరికి ఉంది. వారి తాతల కాలం నాటి ఆస్థానాలు, అప్పటి కట్టడాలు చూస్తే ఈ తరం ప్రజలు ఔరా! అనకుండా ఉండరు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆ నాటి అపురూమైన ప్యాలెస్‌లు అక్కడక్కడా దర్శనమిస్తూన్నాయి. సైఫ్ అలీఖాన్‌ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు కావడంతో వారసత్వంగా ఈ అపురూమైన ప్యాలెస్ ఆయన ఆధీనంలోకి వచ్చేసిందని తెలిసిందే.

 

 

పటౌడీ ప్యాలెస్‌గా పేరు పొందిన ఈ భవంతి హర్యానా రాష్ట్రంలోని పటౌడీ ప్రాంతంలో ఉంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ అందమైన ఉద్యానవనాలు కనిపిస్తుంటాయి. భవంతి ముందు పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌, చుట్టూరా ఉన్న ఉద్యానవనాల నడుమ అత్యంత ఖరీదైన ఈ భవంతి చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ రాజరికపు కట్టడపు విలువ దాదాపు 800 కోట్ల రూపాయలని తెలుస్తుండటం మరింత ఆసక్తికర అంశంగా మారింది. మొత్తం 150 గదులతో కుడి ఉన్న ఈ ప్యాలెస్‌లో 7 డ్రెస్సింగ్‌ రూమ్స్‌, మరో 7 పడక గదులు, డ్రాయింగ్‌ రూమ్స్‌, పెద్ద డైనింగ్‌ హాల్‌తోపాటు పలు సువిశాలమైన గదులున్నాయని తెలిపారు.

 

 

తన తండ్రి మన్సూర్‌ అలీఖాన్‌ మరణం తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ ఈ ప్యాలెస్‌కు కొత్త రంగులు అద్దారు. ఇక ఇందులో ఆయన పూర్వీకులు, పటౌడీ సంస్థానాదీశుల ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సైఫ్ అలాఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్యాలెస్‌ లో  దిగిన పిక్స్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీఖాన్‌ కుటుంబానికి చెందిన బర్త్ డే ఫంక్షన్స్, ఇతరత్రా వేడుకలకు ఈ ప్యాలెస్ వేదిక అవుతుండటం విశేషంగా అని నెటిజన్స్ వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: