అల్లరి నరేష్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన చిత్రాలలో కితకితలు ఒకటని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించడంతో పాటు కథ కూడా ఆయనే అందించి.... తన సొంత ప్రొడక్షన్ కంపెనీ ఈ.వీ.వీ సినిమా బ్యానర్ కింద కితకితలు చిత్రాన్ని నిర్మించాడు. 2006, మే 5వ తేదీన కితకితలు సినిమా విడుదల కాగా... 2006, ఏప్రిల్ 28న పోకిరి సినిమా విడుదల అయ్యింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నిలిచాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో విడుదలైన అన్ని చిత్రాలలో కేవలం కితకితలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టిందంటే అతిశయోక్తి కాదు. 

IHG
సినిమా కథ గురించి తెలుసుకుంటే... రేలంగి రాజబాబు(అల్లరి నరేష్) పై ఒక యువతి అత్యాచారయత్నం చేస్తుండగా ఆమెకు లొంగిపోకుండా తప్పించుకొని... అతడు ఆమె పై కేసు వేస్తాడు. దీంతో ఈ వింత కేసు టీవీల్లో, వార్తా పేపర్ల లో బీభత్సంగా ప్రచురింపబడుతుంది. దాంతో రేలంగి రాజబాబు పై జరిగిన రేప్ అటెంప్ట్ గురించి ప్రజలందరికీ తెలుస్తోంది. న్యాయస్థానంలో నిల్చుని తన కాబోయే భార్య కోసం శీలవంతుడిగా ఉండాలనుకుంటున్నానని తాను చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభం అవ్వగానే ఈ విచిత్రమైన సన్నివేశంతో వీక్షకులను వెండితెరకు కట్టి పడేసాడు ఈవివి సత్యనారాయణ.


రేలంగి రాజబాబు తల్లిదండ్రులకు ఒక కూతురు కూడా ఉంటుంది. రేలంగి కి ఎస్ఐ జాబ్ వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసి వరకట్నం పొంది ఆ కట్నంతో తన బిడ్డ పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ ఎన్ని పెళ్లి సంబంధాలకు వెళ్ళినా రేలంగి రాజబాబుని చూసి 'కావాలని వచ్చిన మహిళనే కాదన్నాడు. బహుశా ఇతనిలో మగతనం లేదేమో' అని ప్రతి పెళ్లి కూతురు భావించి అతడిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సౌందర్య(గీతాసింగ్) అనే ఒక ధనవంతుడి కూతురితో రేలంగి రాజబాబు పెళ్లి కుదురుతుంది. కాని ఆమె లావుగా ఉండటంతో రేలంగి ఈ పెళ్ళికి ఒప్పుకోడు.

IHG

దీంతో అతడి తల్లిదండ్రులు వరకట్నం ఎక్కువగా వస్తుందని కన్విన్స్ చేసి ఆమెకు అంటగడతారు. భార్య లావుగా ఉందని ఆమెను దూరంగా ఉంచుతాడు రేలంగి. వేరే యువతని కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. కానీ చివరిలో ఆ యువతి అతడికి హ్యాండ్ ఇస్తుంది. అప్పుడు తనపై ఎంతో ప్రేమ ఆప్యాయత చూపుతూ నచ్చ చెప్తుంది భార్య. ఆ సమయంలోనే భార్య లావుగా ఉన్న గుణం మంచిగా ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాడు రేలంగి. ఆ తర్వాత రేలంగి హృదయపూర్వకంగా ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. ఇటువంటి సీరియస్ స్టోరీ లో ఎన్నో కామెడీ సన్నివేశాలను పొందుపరిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఈవివి సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: