తెలుగులో ఒకే ఒక్క సినిమాతో స్టార్  విలన్ గా మారిపోయాడు అరవింద్ స్వామి. అతని తో సినిమాలు చేయడానికి గానూ చాల మంది స్టార్ హీరోలు అప్పటి నుంచి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనే ప్రచారం టాలీవుడ్ లో జరుగుతుంది. అయితే అతని తో సినిమా చేయడం మాత్రం అంత ఈజీ కాదు అనేది కొంత మంది చెప్పే మాట. అతను అందరిలాంటి నటుడు కాదు అని అతని తో ఏ మాత్రం కూడా తక్కువ కి సినిమా చేయడం అనేది సాధ్యం కాదు అతని తో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా భారీగా ఇవ్వాల్సి ఉంటుంది అని నిర్మాతలకు అర్ధమైంది. 

 

అందుకే అతనిని తీసుకోవాలి అని భావించినా సరే చాలా అవ్రకు పక్కన పెట్టే ప్రయత్నమే టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా చేసారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో వినపడుతుంది. అతను కథల విషయంలో నటనకు ప్రాధాన్యత ఉండి తనను ఎక్కువగా స్క్రీన్ మీద చూపించే అవకాశం ఉంటే మినహా ఎక్కువగా పారితోషికం డిమాండ్ చేయడం లేదు అని సమాచారం. ఏ హీరో సినిమా అయినా చేస్తాను గాని తన పాత్ర తక్కువ ఉంటే చాలు అని లేదా ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ ఇవ్వాలి  అని స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

అలాగే తాను పాత్ర ఎక్కువగా ఉంటే మాత్రం ఎక్కువ డేట్స్ ని ఇబ్బంది లేకుండా ఇస్తా అని కూడా చెప్పాడు అని సమాచారం. మరి ఏ విధంగా సినిమాలు చేస్తాడు అనేది చూడాలి. ప్రభాస్ సినిమాలో అతన్ని విలన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగానే జరిగింది. కాని అతని నుంచి స్పందన లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: