చిరంజీవికి రాబోయే ఆగష్టుతో 65 సంవత్సరాలు రాబోతున్నాయి. అయినా టాప్ హీరోలకు చెక్ పెట్టె రీతిలో ఈ లాక్ డౌన్ పిరియడ్ లో సోషల్ మీడియాలో సందడి చేయడమే కాకుండా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్రను పోషిస్తూ నిలిచిపోయిన షూటింగ్ లను తిరిగి మొదలుపెట్టడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో రాయబారాలు నిర్వహించి తన ఇండస్ట్రీ పెద్దన్న పాత్రను సుస్థిరం చేసుకున్నాడు.


అంతేకాదు వీలైనంత త్వరలో తన ‘ఆచార్య’ షూటింగ్ ను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయమని కొరటాల పై ఒత్తిడి కూడ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మహేష్ తో ‘సర్కార్ వారి పాట’ మూవీని తీస్తున్న దర్శకుడు పరుశు రామ్ ఈమూవీ షూటింగ్ ను ఎప్పటి నుంచి మొదలు పెడదాము అని మహేష్ ను లేటెస్ట్ గా కలిసి అడిగినట్లు టాక్.


ఈసమావేశంలో పరుశు రామ్ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం మహేష్ నుండి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఇండియా ఈకేసుల విషయంలో ప్రపంచ స్థాయిలో టాప్ 3 స్థాయికి చేరిపోవడమే కాకుండా రానున్న రోజులలో ఈ కేసుల విషయంలో నెంబర్ వన్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు అని వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఉపద్రవం ముంచుకు వస్తున్న వేళ ఇప్పుడు షూటింగ్ లు ఎందుకు ఈసంవత్సరం డిసెంబర్ దాకా ఆగిపోదాం అని సున్నితంగా చెప్పినట్లు టాక్.


దీనితో పరుశు రామ్ ఈ ఏడాది చివరిదాకా ఖాళీగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహేష్ ను ఈ సినిమాలో నటించే విషయంలో ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డ ఈదర్శకుడి శ్రమను కరోనా మరొక విధంగా దెబ్బకొట్టింది. ‘గీత గోవిందం’ లాంటి సూపర్ సక్సస్ వచ్చినతరువాత కూడ పరుశు రామ్ కు కష్టాలు తప్పడం లేదు. అయితే చిరంజీవి లాంటి టాప్ హీరో కరోనాతో పోరాడడానికి సిద్ధపడుతుంటే వయసులో చిన్నవాడైన మహేష్ ఇప్పుడు కరోనాకు భయపడి వెనకడుగు వేయడంతో ఇప్పుడు ఇదే విషయాన్ని ఆదర్శంగా మిగతా టాప్ యంగ్ హీరోలు కూడ తీసుకుంటే పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: