ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాల షూటింగ్ ని కొనసాగించే అవకాశాలు దాదాపుగా అలేవు అని అంటున్నారు సినీ ప్రముఖులు. ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణా లో అయినా సరే ఇప్పుడు సినిమాల షూటింగ్ కి అనుమతులు ఇస్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే సినిమాల షూటింగ్ కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సినిమాల షూటింగ్ మొదలు అయింది అంటే మాత్రం ఇంకా  కేసులు పెరుగుతాయని ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఎవరికి కేసులు లేవు అని కొత్త ఇబ్బందులు వస్తాయి అని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. 

 

ఇక సినిమా షూటింగ్ అంటే ఒకరు లేదా ఇద్దరి తో అయ్యే పని  కాదు అని వందల మంది అవసరం అనేది సినిమాలకు చాలా వరకు ఉంటుంది అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సినిమాల షూటింగ్ కి ఏ మాత్రం కూడా అనుమతులు ఇచ్చే పరిస్థితి వద్దు అని తెలంగాణా సర్కార్ భావిస్తుంది. సినిమాల షూటింగ్ కి ఇప్పటికే అనుమతులు ఇచ్చినా సరే వాటిని రద్దు చేయడమే మంచిది అని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది. లేకపోతే మాత్రం కేసులను ఆపే అవకాశం ఉండదు అని కేసీఆర్ సర్కార్ ఆలోచన గా ఉంది అని చెప్పవచ్చు. 

 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగాచూస్తే తెలంగాణాలో కేసులు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ మినహాయింపు లు ఇచ్చి ఎక్కువగా అకేసులను పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం అయింది అనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వద్దు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఏపీ సర్కార్ ని తెలంగాణా సర్కార్ ని సినీ పెద్దలు కలిసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: