ఇప్పుడు మన తెలుగులో సమంతాకు పెళ్లి అయినా సరే మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగానే ఆడాయి. ఒక్క జాను సినిమా మాత్రమే ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె వరుసగా సినిమాల మీద ఫోకస్ చేసింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టాలీవుడ్ లో ఆమె సినిమాల కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే అంతగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లేదు అనే చెప్పాలి. అయినా సరే ఆమె మాత్రం సినిమాల విషయంలో దూకుడుగానే ఉంది. 

 

ఇక ఇప్పుడు ఆమె కొన్ని సాంగ్స్ ని సినిమాల్లో చెయ్యాలి అని చూస్తుంది. ఐటెం సాంగ్స్ తో పాటుగా కొన్ని పాటల మీద ఆమె దృష్టి పెట్టింది. సాంగ్స్ చేయడం ఏంటీ అనేది స్పష్టంగా సమాచారం లేదు గాని ఐటెం సాంగ్స్ తో పాటుగా కొన్ని పాటలు ఆమె పాడాలి అని భావిస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా ఆమె పాటలను పాడి వాటిని ఆల్బ౦ గా విడుదల చేసే ఆలోచనలో ఉంది అని సమాచారం. వాటిని తన సినిమాల్లో కూడా పెట్టాలి అని తన భర్త సినిమాలో ఒక పాట పాడాలి అని ఆమె ఆలోచించింది అని తెలుస్తుంది. 

 

తన భర్త నటిస్తున్న ఒక సినిమాలో ఆమె తన పాట ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు టాక్. మరి నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు. ఐటెం సాంగ్స్ ని కూడా చేయడానికి ఆమె రెడీ అయింది అని అంటున్నారు. మరి ఏ విధంగా ఆమె ఐటెం సాంగ్స్ చేస్తుంది, స్పెషల్ సాంగ్స్ చేస్తుంది అనేది చూడాలి. త్వరలోనే ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: