తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్లలో సౌందర్య ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో చీర కట్టు అందాల లో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సౌందర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమా లో ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా చీర మాత్రమే ధరించి కేవలం తన అభినయంతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది. 


పెదరాయుడు చిత్రంలో మోహన్ బాబు సరసన అత్యద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. అడపాదడపా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాల్లో ఆమె కొద్దిపాటి ఎక్స్పోజింగ్ చేసి ప్రేక్షకులకు మత్తెక్కించింది. నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమాలో ఆమె వెస్ట్రన్ డ్రెస్సులను మాత్రమే ధరించి బాగా స్కిన్ షో చేసింది. చీరకట్టులో కూడా ఆమె తన నడుమును బాగా ఎక్స్పోజ్ చేస్తూ కుర్రకారుకి చెమటలు పట్టించింది. ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా ఎంతో అందంగా కనిపించే రూపవతి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


ఎక్కువగా తన బొడ్డు అందాలను ఆరబోసిన నటీమణి సౌందర్య అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ అర్థంతరంగా కాలం చేయడం తెలుగు పరిశ్రమకు తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆమె బతికి ఉన్నట్లైతే లేడీ ఓరియెంటెడ్ మూవీలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించేదేమో. 


ఆమె అనేక సినిమాలలోని పాటలలో శృంగార భరితమైన డాన్స్ చేసి సెగలు పుట్టించింది. అమ్మోరు సినిమా లో కాలం తెలియని సుఖము పాటలో సౌందర్య చాలా హాట్ గా కనిపించింది. పెదరాయుడు సినిమా లో కో.. అన్నదోయి...కొండమీద కొక్కిరాయి పాటలు సౌందర్య సెక్సీ హావభావాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలలో సౌందర్య తన చీరకట్టు అందాలను ఆరబోస్తూ సినీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: