పేట ఫేమ్ మాళవిక మోహనన్ తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ ను వదులుకుందట. మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేశాడు. ఇందులో ఓ సినిమా కోసం నిర్మాతలు మాళవికను సంప్రదించగా ఆమె నో చెప్పిందట. భారీ పారితోషికం ఇస్తామన్న సినిమా చేయడానికి మాళవిక ఆసక్తిని చూపించలేదట. గత కొంత కాలంగా సోషల్ మీడియా లో హాట్ ఫొటోలతో  రచ్చ చేస్తుండడంతో దర్శకనిర్మాతల ద్రుష్టి మాళవిక పై పడింది. ఇక కోలీవుడ్ లో పేట తో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ కు ఈసినిమా తరువాత ఏకంగా భారీ ఆఫర్ ను పట్టేసింది.
 
స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ లో మాళవిక హీరోయిన్ గా నటించింది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.  ఈచిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మాళవికకు బ్రేక్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీపావళికి ఈచిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా  తెలుగులో కూడా విడుదలకానుండడంతో మాళవిక తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువకానుంది. 
 
నిజానికి మాళవిక టాలీవుడ్ లో హీరో తో ఎంట్రీ ఇవ్వాల్సివుంది కానీ ఈసినిమా ఆగిపోయింది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  సరసన హీరో లో మాళవిక కు హీరోయిన్ గా నటించే ఆఫర్ వచ్చింది.  గత ఏడాది ఈ చిత్రం ఓషెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది అయితే ఆ షెడ్యూల్ అనుకున్న విధంగా రాకపోకడవంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు దాంతో తెలుగులో ఎంట్రీ కుదరలేదు అయితే ప్రస్తుతం తెలుగు నుండి కూడా ఆవకాశాలు వస్తుండడం తో త్వరలోనే మాళవిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: