జూనియర్ ఎన్టీయార్ ఇపుడున్న హీరోల్లో వేగంగా  సినిమాలు చేస్తున్నాడు అనుకోవాలి. ఆయన అపుడే 28 సినిమాలు చేశాడు. 29వ మూవీగా ఆర్.ఆర్.ఆర్ మూవీ సెట్స్ మీద ఉంది. అదలా ఉండగానే 30వ మూవీని లైన్లో పెట్టేశాడు.  ఈ మూవీ త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్లో ఉంది. 

IHG

అయితే ఈ మూవీ పట్టాలెక్కడానికి ఇంకా చాలా టైం ఉందని అంటున్నారు. నిజానికి ఈ మూవీని ఈ దసరాకు తెద్దామనుకుంటే కరోనా మహమ్మారి వల్ల మొత్తం కధ అడ్డం తిరిగింది. లాక్ డౌన్ పీరియడ్లోనే కాలమంతా కర్పూరంగా గడచిపోయింది. దాంతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇంకా లేట్ అయింది. ఆ తరువాతే ఈ మూవీ అంటున్నారు.

IHG

ఇక దీనికి సంబంధించి త్రివిక్రం కధ రెడీ చేసుకున్నారు.  టైటిల్ కూడా అయినను పోయిరావలె హస్తినకు అంటూ పెట్టారు. అంటే ఓ విధంగా ఇది పొలిటికల్ స్టోరీగా అనుకున్నా కాదు, పక్కా మాస్ అటున్నారు. సరే ఈ మూవీ కోసం త్రివిక్రం వెయిట్ చేస్తూంటే ఆయన్ని అలా లాక్ చేసేసి తాను ఆర్.ఆర్.ఆర్ మూవీలో లాక్ అయిపోయారు.జూనియర్.

IHG

అయితే ఈ మూవీ విషయంలో జూనియర్ ఇపుడు పూర్తిగా రాజమౌళి డెసిషన్ మీదనే ఆధారపడి ఉన్నారని అంటున్నారు. రాజమౌళి ఎంత తొందరగా షూట్ చేసి తనను అన్ లాక్ చేస్తే అంత తొందరగా తాను త్రివిక్రం సినిమా షూటింగులోకి వెళ్ళిపోవచ్చునని అనుకుంటున్నాడు.

IHG's next film with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> ...

మరి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీయార్  పార్ట్ ని అక్టోబర్ నాటికి కంప్లీట్ చేస్తారని అంటున్నారు. అదే జరిగితే జూనియర్ నవంబర్ నుంచి త్రివిక్రం సినిమాతో బిజీ అవుతారన్న మాట. అన్నట్లు ఈ సినిమా ఈ దసరాకు అనుకున్నారుగా అదిపుడు  కాదుట. వచ్చే దసరాకు అంటే 2021 నాటికి వస్తుందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: