ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇప్పుడు జనాలకు ఏ వార్త వచ్చినా సరే ఒక పండగ మాదిరిగా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబ‌లి ది కంక్లూజన్ లాంటి సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా గురించి ప్ర‌జ‌లు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ మెగా, నందమూరి అభిమానులు ప‌డుతోన్న ఉత్కంఠ‌కు లెక్కే లేదు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏ ప్రచారం వచ్చినా సరే ఎంతో ఆస‌క్తితో చూస్తున్నారు.

 

ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త  బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ ఒలివియా మోరిస్ విషయంలో రాజమౌళి వెనక్కు తగ్గినట్టు సమాచారం. ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికా నుంచి తాను ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. మ‌రి కొంత టైం తీసుకుంటాను అని చెప్పింద‌ట‌. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావించిన ఆయన... ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ మీద దృష్టి పెట్టారు అని టాక్. 

 

ఆమెతో కేవలం ఒక వారం రోజులు మాత్రమే అది కూడా చిన్న చిన్న సన్నివేశాలను మాత్రమే షూటింగ్ చేశారు అని... అందుకే ఆ సన్నివేశాలను మళ్ళీ షూట్ చెయ్యాలి రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయిన ఆర్.ఆర్.ఆర్ ను ముందుగా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: