మెగా హీరోలలో చిరంజీవి తర్వాత అంతటి పాపులారిటీ తెచ్చుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ యువతకు ఐకాన్ గా మారారు..ఆయన సినిమాలలో ఉన్న మెసేజ్ ,పంచు డైలాగులు తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకుంటాయి అని వేరేలా చెప్పనక్కర్లేదు..సినిమాలలో పవన్ కళ్యాణ్ స్టయిల్, మ్యానరిజం అందరికీ నచ్చుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెగాస్టార్ తమ్ముడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా సొంత ఇమేజ్ ను క్రియేట్ చేస్తూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

 

 


వరుస సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ వరుస హిట్ సినిమాలతో ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అబ్బాయిలను మాత్రమే కాదు అమ్మాయిలను కూడా ముగ్ధులను చేసిందంటే అతిశయోక్తి కాదు..పవన్ కళ్యాణ్  కు  సినిమాలలోనే కాదు బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీనీ స్థాపించి జనాల కష్టాలను తెలుసుకున్నాడు.అందుకే పవన్ అంటే యువతకు ఎనలేని అభిమానం..

 

 

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు అంత క్రేజ్ ఎందుకు వచ్చిందనే సందేహాలు చాలా మందికి కలగడం సహజమే.. పవన్ కళ్యాణ్ సినిమాలలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే విధంగా డైలాగులు, సీన్లు, పాటలు,రొమాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు పవన్ కు క్రేజ్ ను తీసుకొస్తే.. అన్నిటికన్నా ఎక్కువగా ఆయన యాక్షన్ యువతను ఆకట్టుకున్నాయి..అందుకే పవన్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుడికి అంత అభిమానం.. మాస్ యాక్షన్ టాక్ ను అందించిన సినిమా అంటే అది గబ్బర్ సింగ్ అని అభిమానులు చెప్తున్నారు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించాడు..రౌడీల పని పట్టే విధంగా ఆయన పాత్ర ఉంటుంది. పోలీసు కు ఉండాల్సిన లక్షణాలను కళ్ళకు కట్టినట్లు పవన్ చూపించారు. దాంతో యువతను ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.. హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా పవన్ కు ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: