కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ ముని 2 (కాంచన)  హిందీలో లక్ష్మి బాంబ్ గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన రాఘవ లారెన్స్రీమేక్ ను తెరకెక్కించగా స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా నటించారు. ఇకఈసినిమా డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకానుందని ఇటీవల వార్తలు వచ్చాయి అయితే అలాంటిదేమి లేదని నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు కానీ ఇప్పట్లో థియేటర్లు ఓపెన్  అయ్యే పరిస్థితి లేకపోవడంతో  తాజాగా మేకర్స్ మనసు మార్చుకొని  డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పారట. త్వరలోనే రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.
 
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా ను భారీ ధరకు దక్కించుకుంది. ఇక ఈసినిమా విడుదలతేది కూడా ఫిక్స్ అయ్యిందని  వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15న లక్ష్మి బాంబ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందట. తుషార్ కపూర్ ,శరద్ కెల్కర్ ముఖ్యపాత్రలు పోషించినఈ చిత్రాన్ని తుషార్ ఎంటర్టైన్మెంట్స్ ,షబీనా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.  
 
 ఇదిలావుంటే బాలీవుడ్ నుండి ఇప్పటికే గులాబో సీతాబో డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకాగా విద్యాబాలన్  ప్రధాన పాత్రలో నటించిన శకుంతలా దేవి జులై 31న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. ఇవే కాకుండా  జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా కూడా త్వరలోనే  నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది. ఇక స్టార్ హీరో అజయ్ దేవగణ్  నటించిన లేటెస్ట్ మూవీ  భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా హక్కులను దక్కించుకుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: