మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ప్రపంచ మానవాళి మనుగడ శూన్యం అన్న భయాలు ఏనాటి నుంచో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధం కంటే ముందుగానే కరోనా ప్రపంచ మానవాళి పై దాడి చేయడంతో దాని విపత్తు మూడవ ప్రపంచ యుద్ధ నష్టాన్ని తలపిస్తోంది.


ప్రభాస్ కు ‘బాహుబలి’ స్థాయికి మించి ఒక బ్లాక్ బష్టర్ హిట్ ఇవ్వాలి అన్న తపనతో దర్శకుడు నాగ్ అశ్విన్ సుమారు ఒక సంవత్సరం పైగా ఆలోచించి వ్రాసిన కథ మూడవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఉంటుంది అన్నలీకులు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ కథ సైన్స్ ఫిక్షన్ అన్న లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈకథకు మూడవ ప్రపంచ యుద్ధం తోడవ్వడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.


సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలి అని భావిస్తున్న ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చుకు సంబంధించిన అంచనాలను కరోనా తరువాత పరిస్థితులు కూడ ప్రభావితం చేయలేకపోయాయి. దీనితో ముందుగా అనుకున్న 400 వందల కోట్ల బడ్జెట్ లో ఎలాంటి కోతలు విధించడంలేదని ఓపెన్ గా ఈ మూవీ నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తూ అనేక ప్రపంచ భాషలలో కూడ విడుదల చేయడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈమూవీ బడ్జెట్ కు తగ్గట్టుగా రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీకి సంబంధించి సుమారు 40 కోట్ల ఖర్చుతో ఒక భారీ సెట్ ను వేస్తున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే రాబోయే విజయదశమి కి ఈమూవీని మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు హీరోయిన్ గా దీపిక పదుకొనె ఎంపిక ఖరారు కావడంతో త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదల అవుతుంది అని అంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: