భగవంతుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు. నిజమే అమ్మ గొప్పతనం అలాంటిది. అమ్మ అనే పిలుపులో ఎంతో మాధుర్యం. ఎంతో మమకారం ఎంతో తియ్యదనం. అమ్మ గురించి ఎంతోమంది కవులు, ఎంతోమంది రచయితలు చాలా విధాలుగా వర్ణించారు. మనల్ని మనలా ప్రేమించేది కేవలం ఒక్క అమ్మ మాత్రమే. అలాంటి అమ్మ తనానికి దర్పణం పట్టిన సినిమానే మాతృదేవోభవ.

 

 

అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి. అందులో ఒకటి మాతృవేదోభవ.. ప్రతి ఒక్కరినీ కదిలించి ఓ క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం.. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యానార్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా...అమ్మ ప్రేమకి అసలైన అర్ధం చెప్పింది ఈ సినిమా..1993 లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.. నాజర్, మాధవి ల నటన సినిమాకి ప్రాణం పోసింది.. అనాథాశ్రమంలో పెరిగున శారద(మాధవి), సత్యం(నాజర్)లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరికి నలుగురు సంతానం కలుగుతారు.

 

 


విధివశాత్తూ భర్తను కోల్పోయిన శారద తన లాగా తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరికి తాను చనిపోతుంది. దత్తత ఆయితే ఇచ్చింది కానీ ఆ తరవాత తన పిల్లల కోసం పడే తాపత్రయం కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు.. అంతేకాకుండా ఆ నలుగురు అక్క,తమ్ముడు,అన్నయ్య ఒకరిని ఒకరు విడిచి ఉండేలేకా పడే బాధ ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి సన్నివేశం అందరిని ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఎప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: