మాస్ మహారాజకి ప్రేకక్షకుల నుండి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలో భద్ర ఒక్కటి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. కొన్ని సినిమాలు టీవీల్లో ఎన్ని సార్లు వచ్చినా చూస్తాం.. ఎన్నేళ్లయినా చూస్తాం. అలాంటి సినిమాలో భద్ర ఒక్కటి.

 

 

రవితేజ హీరోగా బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ తొలి చిత్రం ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బోయపాటి రూపంలో టాలీవుడ్‌కు మరో మాస్‌ డైరెక్టర్‌ దొరికాడని అందరూ భావించారు. మాస్‌ మహారాజ్‌ రవితేజలోని ఓ విభిన్న ప్రేమికుడిని బోయపాటి తనదైన స్టైల్లో వైవిధ్యంగా చూపించాడు. ప్రేమ, త్యాగం, యాక్షన్‌, ఎమోషన్‌ ఇలా డిఫరెంట్‌ యాంగిల్స్‌లో కనిపించిన రవితేజ తన నటనతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. 

 

 

ఇక పాటలకు మరో ప్రధాన బలం సంగీతం. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ అందించిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. ‘తిరుమల వాసా తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి గొనవయ్యా’, ‘ఏమైంది సారు ఏంటా హుషారు’, ‘ఓ మనసా’ ఇలా ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీరాజాస్మిన్‌ మన పక్కింటి అమ్మాయిగా కనిపించి తన నటనతో యువత డ్రీమ్‌ గర్ల్‌గా మారిపోయింది.

 

 

ఇక రవితేజ, అర్జున్‌ బజ్వాల మధ్య సీన్స్‌ స్నేహితులను కట్టిపడేసేలా ఉంటాయి. ఇక ప్రకాష్‌ రాజ్‌, మురళీమోషన్‌, ఈశ్వరీ రావు తదితరులు తమ నటనతో సినిమాకు మరింత జీవం పోశారు. దిల్‌ రాజ్‌ నిర్మాత వ్యహరించిన ఈ చిత్రాన్ని తొలుత అల్లు అర్జున్‌తో తీయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే కథ నచ్చినా కొత్త దర్శకుడు అనే కారణంతో బన్ని వెనకడుగు వేశాడు. దిల్‌ రాజ్‌ సూచనతో రవితేజను హీరోసినిమా పట్టాలెక్కించి ఘన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల మదిలో నిల్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: