టాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత అతని మార్కెట్ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది. చిన్న చిన్న సినిమాల దర్శకులతో అసలు ఆయన పని కూడా చేయడం లేదు అనే చెప్పాలి. ఆయన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో బాగా వసూళ్లు సాధించిన సినిమాలు బాహుబలి సాహో. ఇక అక్కడి నుంచి ప్రభాస్ అనగానే కమర్షియల్ హీరో అనే విషయం అందరికి అర్ధమైంది. దీనితో ఇప్పుడు అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు. అగ్ర నిర్మాతలు చాలా మంది అతని తో సినిమా చేసే అవకాశం వస్తే చాలు అనుకునే పరిస్థితి లో ఉన్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో అతని తో సినిమా చేయడానికి గానూ బాలీవుడ్ హీరోయిన్ లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. శ్రద్దా ఇప్పటికే అతని తో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక దీపిక కూడా అతని తో సినిమా చేస్తాను అంటుంది గాని కొన్ని కండీషన్ లు పెడుతుంది. ఇక అవి ఏంటీ అంటే తనకు బాలీవుడ్ హక్కులు కావాలి అని ఆమె అడుగుతుంది. హక్కుల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో అక్కడ అతని తో సినిమా చేయడానికి ఆమె రెడీ అయింది. 

 

అయితే తనకు హక్కులు కావాలి అని అప్పుడే సినిమా చేస్తాను అని ఆమె పట్టుదలగా చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆమెకు ఆ అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి. నాగ్ అశ్విన్ సినిమాలో ఆమె హీరోయిన్ అని అంటున్నారు. మరి ఆమె అందులో హీరోయిన్ గా చేస్తుందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: