తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన మాస్ మహరాజ రవితే తర్వాత చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత ఇడియట్ చిత్రంతో హీరోగా మారాడు. స్వయంకృషితో పైకి వచ్చిన ఈ నటుడిని లైక్ చేసే వారు ఎంతో మంది ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ అభిమానిగా చెప్పుకుంటోన్న ఎం.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ఎస్ఎం4 బ్యానర్‌లో సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఓ లోఫర్ గాడి ప్రేమ కథ’ అనేది ఉపశీర్షిక.  ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఎమ్.ఎన్.వి.సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన చిత్రం ‘కొంటె కుర్రాడు’.

 

‘ఓ లోఫర్‌గాడి ప్రేమ కథ’ అనేది ఉపశీర్షిక. పునర్జన్మ నేపథ్యంలో ట్రయాంగిల్  మాస్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా బ్యానర్ లోగో, టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు ఎమ్.ఎన్.వి.సాగర్ మాట్లాడుతూ ‘‘మాస్ మహారాజా రవితేజను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాను.

 

ఈ సినిమాలో ఎనభై శాతం రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ వర్క్ చేస్తున్నారు. ఆయన అభిమానిగా నేను చేస్తున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఊహాలకి అందని ట్విస్టులతో ఉత్కంఠ భరితంగా ఉంటుందని తెలిపాడు. నా ఒక్కడితో మొదలైన ఈ చిత్రం ఎనభై శాతం మాస్ మహా రాజా డై హార్డ్ ఫ్యాన్స్ వర్క్ చేస్తున్నారు. ఆయన అభిమానిగా నేను చేస్తున్న ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఊహాలకి అందని ట్విస్టులతో ఉత్కంఠ భరితంగా ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: