టాలీవుడ్ లో ప్రయోగాల విషయంలో ఇప్పుడు మెగా హీరోలు ముందు ఉన్న సంగతి తెలిసిందే. ఏ సినిమాలో అయినా సరే వాళ్ళు ప్రయోగం చేయడానికి ఏ మాత్రం కూడా భయపడే పరిస్థితి అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఏ సినిమాలో అయినా సరే వాళ్ళు ఏ విధంగా అయినా సరే నటించడానికి అన్ని విధాలుగా సిద్దమవుతున్నారు. చిరంజీవి నుంచి నిన్నా మొన్నా  వచ్చిన వారి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది అని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం వీరి హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. వారి సినిమాలు అనగానే జనాలకు ఒక క్రేజ్ ఉంది. 

 

ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో ఇప్పుడు మెగా హీరోలు అందరూ కూడా దర్శక నిర్మాతలకు ఒక సంకేతం ఇచ్చినట్టు తెలుస్తుంది. తాము ప్రయోగాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారట ఇక నిర్మాతలు అందరూ కూడా అందుకు తగిన విధంగా కథలను తెస్తే తాము చేయడానికి సిద్దంగా ఉన్నట్టు వివరించారు. చిరంజీవి తో ఇటీవల సమావేశం అయిన హీరోలు దీనిపై చర్చించి ఇక ప్రేక్షకుల్లో ఆదరణ అనేది ఉండాలి అంటే కచ్చితంగా ప్రయోగాలు చెయ్యాలి అని రెగ్యులర్ కథలను అసలు వద్దు అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

 

రామ్ చరణ్ ఎలాగూ ప్రయోగాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా అందుకు రెడీ గానే ఉన్నాడు. ఇక చిన్న చిన్న హీరోలు వరుణ్ తేజ్ తో పాటుగా మరి కొందరు ఇప్పుడు ప్రయోగాల మీద ఫోకస్ చేస్తే మంచిది అనే భావన లో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఏ విధంగా ప్రయోగాలు చేస్తారు అని. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో బన్నీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఆచార్య లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: