ఇప్పుడు మన తెలుగులో కాజల్ కి ఇంకా డిమాండ్ ఉంది. ఆమెకు మంచి ఆదరణ అయితే టాలీవుడ్ లో లభిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు అనే తేడా లేకుండా ఆమె సినిమాలు చేస్తుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తెలుగులో రెండు సినిమాలు తమిళం లో ఓకే సినిమా చేస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అనే దాని మీద ఇంకా ఏ స్పష్టత కూడా లేదు. 

 

ఇక ఇప్పుడు కాజల్ విషయానికి వస్తే ఆమె వివాహం చేసుకోవడానికి రెడీ అయింది అని అంటున్నారు. ఇక ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు అని ఇప్పటికే సినిమాను పట్టుకుని వేలాడుతుంది నే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆమె ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని సినిమాలకు దూరంగా ఉండాలి అని భావిస్తుంది అని అంటున్నారు. త్వరలోనే ఆమె వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. తమిళంలో ఆమె స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తుంది. ఇక ఇక్కడ చిరంజీవి తో ఆచార్య అనే సినిమాలో చేస్తుంది. 

 

తారక్ త్రివిక్రమ్ సినిమాలో ఆమెను తీసుకోవాలి అని భావించారు గాని ఆమె సూట్ అయ్యే అవకాశ౦ లేదు అని ఆమెను దాదాపుగా పక్కన పెట్టారు అనే వ్యాఖ్యలు అయితే టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఆమె వివాహం చేసుకోవడానికి సిద్దంగా ఉండి అని తెలుస్తుంది. త్వరలోనే ఆమె వివాహం చేసుకునే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఎవరిని ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉంది అనే దాని మీద ఇంకా స్పష్టత అనేది రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: