ఇటీవల రమ్యకృష్ణ కారులో మద్యం దొరకడం చెన్నై లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె కారులో మద్యం దొరకడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా. వెంటనే ఆమెకు బెయిల్ రావడం డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం ఇది మొత్తం చెన్నై మీడియా ప్రధానంగా హైలెట్ చేయడం తో ఆమె ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీడియా స‌ర్కిల్స్‌లోనూ, అటు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ బాగా సంచ‌ల‌న వార్త అయ్యింది..

 

ఇక ఇటీవల ఆమె ఒక సీరియల్ కి సైన్ చేసారు. ఆ సీరియల్ షూటింగ్ లో కూడా ఆమె పాల్గొనడం లేదు అని సమాచారం. అసలు ఆమె ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు అని అంటున్నారు. చాలా వరకు ఆమె ఇంట్లో ఇంట్లో ఉంటున్నారు అని ఇంటికి ఎవరు వచ్చినా సరే అసలు మాట్లాడటం లేదు అని అంటున్నారు. సినిమాలకు సైన్ చేయడానికి కూడా ఆమె ముందుకు రావడం లేదట. 

 

హీరోలు ఒక ఇద్దరు ఇటీవల ఆమె ఇంటికి వెళ్ళారు అని అయినా సరే ఆమె వారితో అసలు మాట్లాడలేదు అని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారంతో ఆమె కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామం మాత్రం ఆమెను బాగా అవమానానికి గురి చేసింది అంటున్నారు. మ‌రి ర‌మ్య‌కృష్ణ ఈ విష‌యాన్ని అంత సీరియ‌స్ గా ఎందుకు తీసుకుంటున్నా రో ?  దీనిని ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ షూటింగ్‌ల్లో ఎప్పుడు యాక్టివ్ అవుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: