గతంలో కొన్ని సినిమాలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి అంటూ అనేక సినిమాలకు సమస్యలు ఎదురైన విషయం తెలిసిందే. ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలోని ఒక పాట పై ఒక సామాజిక వర్గం అభ్యంతరాలు తెలిపితే గత సంవత్సరం వచ్చిన ‘వాల్మీకి’ మూవీ టైటిల్ ను ‘గద్దల కొండ గణేష్’ మూవీగా టైటిల్ ను మార్చే వరకు మరొ సామాజిక వర్గం న్యాయపోరాటాలు చేసింది.  

 

అయితే ఓటిటి లలో విడుదల అవుతున్న సినిమాలు కూడ తన మనోభావాలకు అడ్డు తగులుతున్నాయి అంటూ ఇప్పటి వరకు వివాదాలు రాలేదు. అయితే ఇప్పుడు ఈ వివాదాలు ఒటీటీ లో విడుదలయ్యే సినిమాలను కూడ వదిలి పెట్టడం లేదు. ‘భానుమతి రామకృష్ణ’ అనే టైటిల్ తో వెబ్ ఫిల్మ్ జూలై 3న ఆహా లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ టైటిల్ పట్ల అలనాటి హీరోయిన్ భానుమతి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి ఈమూవీ టైటిల్ అలనాటి భానుమతిని గుర్తుకు చేస్తే చేసి ఉండవచ్చు కాని ఆమెను కించపరిచే విధంగా ఎటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉండే అవకాశం లేదు. దీనితో ఈ చిన్న వెబ్ సినిమాకు భానుమతి ఫ్యామిలీ ఎందుకు అభ్యంతరాలు చెపుతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.


మూవీ ‘ఆహా’ లో విడుదల అవుతోంది కాబట్టి ఆహా సంస్థ నిర్వాహకుడు అల్లు అరవింద్ కు అలనాటి నటీనటుల కుటుంబ సభ్యులతో కూడ మంచి సంబంధాలు ఉంటాయి. దీనితో ఈ చిన్న సమస్యను అరవింద్ తెలివిగా ఎవరికీ నష్టం లేకుండా పరిష్కరించుకునే అవకాసం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘కాదేది కవితకు అనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా సినిమాలు సీరియల్స్ వెబ్ సిరీస్ లు ఇలా ప్రతి విషయంలోనూ ఎదో ఒకచోట ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటే ఇక సినిమాలు తీయడం ఎవరితరం కాదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: