అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ కలిసి దాదాపు పది సినిమాల్లో నటించారు. 1998 వ సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రలేఖ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కు కార్ ఆక్సిడెంట్ అవ్వగా... ఆమె ఆసుపత్రిలో పడకకే పరిమితమవుతోంది. అయినా కొన్ని పాటలలో రమ్యకృష్ణ కి పూర్తిగా నయమైనట్టు కృష్ణవంశీ చూపించాడు. మొగలి పొదలు అనే శృంగార భరితమైన పాటలో రమ్యకృష్ణ, నాగార్జున మధ్య కొనసాగే కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేసిందని ప్రేక్షకులను కట్టిపడేసిన నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో రమ్యకృష్ణ నీళ్లలో తడుస్తూ తన అందాలను విపరీతంగా ఆరబోస్తూ ప్రేక్షకులకు మతిపోగొట్టేసింది. ఈ సినిమాలో డివ్వి డివ్వి డివ్విట్టం అనే పాటలో రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ నాట్యానికి అభినయానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. 


సినిమా కంటే ముందే అనగా 1994 వ సంవత్సరం లో నాగార్జున, రమ్యకృష్ణ జతకట్టారు. ఆంగ్ల బాషా చిత్రం ది ఫుజిటివ్ ఆధారంగా తెరకెక్కిన క్రిమినల్ మూవీ లో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలో నటించారు. డాక్టర్ అజయ్ కుమార్ డాక్టర్ శ్వేత పాత్రలలో అక్కినేని నాగార్జున, మనీషా కొయిరాలా నటించగా... అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమ్య గా రమ్యకృష్ణ నటించింది. శ్వేతా, అజయ్ కుమార్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.


తదనంతరం ఆమె గర్భవతి కూడా అవుతుంది. ఆ సమయంలోనే తన ఆసుపత్రిలో అవయవాల అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకొని ఏసీపీ రమ్యకు తెలియజేస్తుంది. ఈ విషయం కాస్త అక్రమంగా రవాణా చేసే ఒక డాక్టర్ కి తెలియడంతో తన గుట్టు ఎక్కడ రట్టవుతుందో అని భయంతో ఆమె చంపేస్తాడు. ఈ తెలుసుకున్న అజయ్ ఆమె ఇంటికి వెళ్తాడు అదే సమయంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి హత్య చేశాడని చెప్పి ఉరిశిక్ష వేసారు. కానీ అతను తప్పించుకొని ఏసి రమ్య ఇంటికి వచ్చేస్తాను అమాయకుడని చెబుతాడు. 


ఈ క్రమంలోనే ఆమె తనని ప్రేమిస్తుందని అతడు తెలుసుకుంటాడు. కానీ అతను మాత్రం ఆమెను స్నేహితురాలు లాగానే చివరివరకు చూస్తాడు. సినిమాలో మనీషా కొయిరాలా కంటే రమ్యకృష్ణ చాలా అందంగా కనిపించింది అని చెప్పుకోవచ్చు. హలో గురు, ఝమ ఝమ ఝమ పాటలు రమ్యకృష్ణ నాగార్జున కెమిస్ట్రీ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. మనిషా కొయిరాలా, నాగార్జున తో ఉండే తెలుసా మనసా పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెంబర్ వన్ గా నిలుస్తూనే ఉంది. ఇకపోతే సోగ్గాడే చిన్ని నాయన, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, సంకీర్తన, ఇద్దరూ ఇద్దరే చిత్రాల్లో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించి తెలుగు ప్రేక్షకులను తనకి కట్టిపడేసింది. కొన్నేళ్ళ క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: