మన తెలుగులో ఇతర భాషల నటులకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర భాషల సినిమాలను విడుదల చేయడానికి ఏ విధంగా అయితే అక్కడి హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఇక అక్కడి నటులు కూడా ఇక్కడ తెలుగులో సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు జనాలు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషల నటులకు ఉన్న డిమాండ్ గురించి  మాట్లాడితే ప్రధానంగా మాట్లాడే నటులు విజయ్ సేతుపతి అక్షయ్ కుమార్. వీరికి విలన్ లు గా అవకాశాలు వస్తున్నాయి. 

 

రోబో రెండో వెర్షన్ లో విలన్ గా అక్షయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఇక విజయ్ సేతుపతి నటుడిగా కూడా మంచిగానే ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి కి మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే ఆయన పూర్తి స్థాయిలో తెలుగు సినిమా చేయలేదు గాని ఆయనకు మాత్రం క్రేజ్ బాగానే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మహేష్ సర్కారు వారి పాటలో విలన్ గా అక్షయ్ ని తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. 

 

దీనికి అక్షయ్ కూడా ఓకే చెప్పాడు అని సమాచారం. మరి అక్షయ్ ఎప్పుడు షూటింగ్ కి వస్తాడు అనేది తెలియదు గాని సినిమాను పాన్ ఇండియా లెవెల్ కి తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ అక్కడ సినిమా బాగా ఆడాలి అంటే కచ్చితంగా అక్షయ్ అయితే బాగుంటుంది అని అంటున్నారు. టాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: