కమల్ హాసన్ సినిమా అంటే జనాలకు ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలను ఆల్ ఇండియా మొత్తం చూస్తారు అభిమానులు. అందుకే ఆయనకు విశ్వ నటుడు అనే పేరు కూడా ఉంది. ఆయన ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు కచ్చితంగా అందం తీసుకొచ్చే విధంగా ఆయన నటిస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఏ పాత్ర అయినా సరే ముందు ఆయనే సినిమాలో హైలెట్ అవుతూ ఉంటారు అనే సంగతి తెలుసు. ఇక ఆయనకు మార్కెట్ కూడా భారీగానే ఉంటుంది తమిళం లో అయినా ఎక్కడ అయినా సరే. అందుకే ఇప్పుడు ఆయన మీద తెలుగులో ఫోకస్ చేసారు. 

 

లాక్ డౌన్ లో భారీగా నష్టపోయిన నిర్మాతలు దిల్ రాజు అల్లు అరవింద్ సహా కొందరు ఇప్పుడు ఆయన మీద ఫోకస్ చేసారు. వారి సినిమాల్లో ఆయనను తీసుకుంటే తమిళంలో ఆయనకు ఉన్న క్రేజ్ ఉపయోగపడుతుంది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఆయన విషయంలో మాత్రం చాలా వరకు ముందు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అని సమాచారం. ఆయన ఎక్కువగా డిమాండ్ చేసినా సరే జాగ్రత్తగా ఆయనను  ఒప్పించి అవసరం అయితే తమిళ హక్కుల్లో కాస్త వాటా ఇవ్వాలి అని భావిస్తున్నట్టు టాక్. 

 

ఆయన విషయంలో ముందు నుంచి కూడా మన తెలుగులో సానుకూలంగానే ఉన్నారు జనాలు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి అని తద్వారా తమిళ మార్కెట్ ని పెంచుకోవాలి అని ఒక్క తెలుగు లో సినిమాలు ఆడితే లాభం ఉండదు అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలా వరకు ఆయన తో సినిమా చేస్తే ఆయనకు ఉన్న ఫాలోయింగ్ బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: