ప్రముఖ బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మరణ వార్త అందర్నీ కలచి వేసింది. ఎంతో ప్రతిభతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. సుశాంత్ మరణం వెనుక ఏవో బలమైన కారణాలే ఉన్నట్టు బాలీవుడ్ గుసగుసలాడుతోంది. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు వీరే కారణమంటూ ఎనిమిదిమంది బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది . ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారంటూ బిహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా బీహార్‌లోని ముజఫ్ఫర్ ‌పూర్‌లో బుధవారం ఉదయం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. 

 


ఈ పిటిషన్ లో సల్మాన్ ఖాన్ , ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత , బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ ఏక్తా కపూర్ సహా మరో నలుగురి పేర్లను ఆయన ఈ పిటీషన్లో చేర్చారు.మానసికంగా హింసించడం వల్లే సుశాంత్ చనిపోయాడని ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. వీరిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. సుధీర్ కుమార్ ఓఝా. ధర్మ ప్రొడక్షన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్, సాజిద్ నడియాడ్ వాలా, టి - సిరీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, దినేష్ విజన్, బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సుశాంత్ కు అవకాశాలు రాకుండా చేయడంతో సుశాంత్ మానసికంగా కృంగిపోయాడని అన్నారు.

 


ఇలా ఇదే అంశం పై బాలీవుడ్ లో గాసిప్స్ ఊపందుకున్నాయి. సుశాంత్ ను ఇండస్ట్రీ నుంచి దూరం చేయడానికి కావాలనే కొందరు ఇండస్ట్రీ పెద్దలు తనకి ఆఫర్లు రాకుండా చేసారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని చిత్రాల విడుదల కూడా ఆగిపోయింది. ఏడు సినిమాల నుంచి అతడిని తొలగించారు. అందువల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు" అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: