టాలీవుడ్ లో రానా సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా సినిమా వస్తుంది అంటే చాలు కథ ఏ విధంగా ఉంటుంది సినిమాలో హీరోయిన్ ఎవరు దర్శకుడు ఎవరు టైటిల్ ఎలా ఉంటుంది అంటూ ఏదోక టాపిక్ ఆ సినిమా గురించి కచ్చితంగా వినపడుతూనే ఉంటుంది. ఇక బాబు కి బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ  కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అక్కడి ఫాన్స్ ని కూడా అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటీ అంటే... 

 

బాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు అతనికి పరిచయాలు ఉన్నాయి. అగ్ర హీరోల నుంచి అగ్ర దర్శక నిర్మాతలు కూడా బాగా తెలుసు. దీనితో ఇప్పుడు తను ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడి ఒక స్టార్ హీరోతో తాను కూడా కలిసి ఒక సినిమాను నిర్మించాలి అనే ఆలోచన రానా చేస్తున్నాడు అని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు గాని దీనిని మాత్రం త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్తారు అని రానా పెళ్లి కారణంగా సినిమా వాయిదా పడింది అని అంటున్నారు. 

 

దీనికి సంబంధించి ఎప్పుడో చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని సినిమా మొదలు కావడమే ఆలస్యం అని టాలీవుడ్ లో కూడా అంటున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఎంత బడ్జెట్ తో వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు రానా రెండు సినిమాలను తెలుగులో ఒక సినిమాను హింది లో చేస్తున్నాడు. తమిళం లో కూడా రెండు సినిమాలను ఆయన లైన్ లో పెట్టినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చేస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: