మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ అయ్యాడు అనాలో.. జబర్దస్త్ కే నాగబాబు బ్రాండ్ అయ్యాడా అని చెప్పాలంటే కొంచెం కష్టమే. ఆస్థాయిలో తెలుగు ప్రజల్లో ఈ నవ్వుల కార్యక్రమం వెలిగిపోయింది. జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడం కూడా ఇలానే ఆలోచించాలి. ‘అదిరింది’ అనే షో ద్వారా వేరే చానెల్ లో ప్రయోగం చేశాడు. అయితే.. ఈ కార్యక్రమం అంతగా ఆకట్టుకోలేదు. అయితే.. ఈ రంగంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు మరో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా చేశాడు.

IHG

 

నాగబాబుకు యూట్యూబ్ లో చానెల్ ఉన్న విషయం తెలసిందే. ఇటివలే ఆ చానెల్ పేరు కూడా నా చానెల్ నా ఇష్టం నుంచి.. ‘మన చానెల్ మన ఇష్టం’ అని మార్చాడు కూడా. ఇకపై ఇందులో కాంట్రవర్సీలు ఉండవు అని నర్మగర్భంగా చెప్పాడు కూడా. ఇప్పుడు ఈ మాటలనే నిజం చేస్తూ ఆ చానెల్ లో ఓ ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్ లో డిటైల్స్ పోస్ట్ చేశాడు. ‘అల్టిమేట్ కామెడీ సిరీస్.. ఆసక్తి ఉన్న నటులు, రచయితలకు ఆహ్వానం.. త్వరపడండి’ అంటూ టాలెంట్ ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు.

IHG

 

తన నాగబాబు అఫిషియల్ చానెల్ లో దీనిని ప్రసారం చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇందుకు ఓ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. జబర్దస్త్ ద్వారా నాగబాబుకు కామెడీ టైమింగ్, కంటెంట్, స్కిట్ల మీద మంచి అనుభవం వచ్చింది. అయితే.. అదిరిందిలో ఆ మ్యాజిక్ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు యూట్యూబ్ చానెల్ ద్వారా సక్సెస్ కావాలని కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రకటన ఔత్సాహికులకు ఉపయోగపడేదే. మరి నాగబాబు ఈసారైనా తన స్థాయి మ్యాజిక్ చేసి రాణిస్తాడేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: