సినిమాల్లో కొన్ని ఫీల్ గుడ్ కేటగిరీకి చెందుతాయి. ఇది ధియేటర్లో చూసేందుకు బాగున్నా కలెక్షన్లు తీసుకురాలేవు. కానీ.. ఇవే సినిమాలు టీవీల్లో వస్తే మాత్రం ఆదరణ వేరేగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ తో టాప్ లో నిలుస్తాయి. ఒక్కసారి కాదు.. రిపీటెడ్ గా ఎన్నిసార్లు టెలికాస్ట్ అయినా మంచి ఆదరణ ఉంటుంది. అటువంటి కేటగిరీలోకి వచ్చే సినిమాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కూడా ఉంటుంది. సంపన్న, పేద వర్గాల మధ్య జీవనం ఎలా ఉంటుందో తన శైలిలో చాలా వినోదాత్మకంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల.

IHG

 

ఇందుకు తనకు అచ్చొచ్చిన యూత్ నే ఈ కథకు బేస్ చేసుకున్నాడు. కథలో ఆహ్లాదం తీసుకొచ్చేందుకు కుర్రాళ్లు, అమ్మాయిలు, ప్రేమ, గ్యాంగ్, స్నేహం.. కంటెంట్లనే తీసుకున్నాడు. రెండు వర్గాల్లో ఉండే తారతమ్యాలను బాగా చూపించాడు. ఓ కుటుంబంలోని సందడిని గల్లీల్లో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం.. సరదాగా ఉండడం డబ్బు లేకపోయినా ఒక్కటిగా ఉండడం అనే కాన్సెప్ట్ చూపించాడు. సంపన్న వర్గాల్లో కుర్రాళ్లు తమకున్న డబ్బుతో ఏదన్నా చేయగలరని చూపిస్తూనే.. స్నేహం, ఆప్యాయతే అన్నింటికంటే ముఖ్యమని చూపిస్తాడు. ఈ నేపథ్యంలో జరిగే అల్లరి, సందడి ప్రేక్షకులకు ఫీల్ గుడ్ మూవీని తలపిస్తాయి.

IHG

 

అయితే ఈ సినిమా ధియేటర్లలో ఆడలేదు. కారణం.. అప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీడేస్ థీమ్ లానే ఈ సినిమా కూడా ఉండటం. అక్కడ కాలేజీ నేపథ్యం తీసుకుంటే ఇక్కడ కుటుంబాల నేపథ్యం తీసుకున్నాడు. దీంతో ప్రేక్షకులకు కాస్త మోనాటనీ అనిపించి సినిమా రన్ కాలేదు. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. టీవీల్లో ప్లే అయితే ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. దీంతో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా ఆకట్టుకుంటుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: