ప్రముఖ మలయాళ డైరెక్టర్ సచి కొద్దీ సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం సచి గుండె పోటు తో త్రిసూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు అయితే పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. సచి మరణ వార్త మాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. రైటర్ గా మళయాల ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సచి అనతికాలంలోనే టాప్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2015లో అయన ,అనార్కలి తో డైరెక్ట్ గా మారాడు. రీసెంట్ మలయాళ బ్లాక్ బాస్టర్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు సచి, రైటర్ గా పనిచేశాడు.
 
ఇక అయ్యప్పనమ్ కోషియంతో సచి పేరు మారుమోగిపోయింది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ,బిజూ మీనన్ తో సచి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈచిత్రం తెలుగు పాటు తమిళ ,హిందీ భాషల్లో రీమేక్ కానుంది. ఈసినిమా తరువాత సచి మరోసారి పృథ్వీరాజ్ తోనే సినిమా చేయాల్సివుంది అందుకు కథ కూడా సిద్ధం చేసి పెట్టాడు ఇంతలోనే ఇలా జరిగింది. సచి మరణం మలయాళం ఇండస్ట్రీకి తీరనిలోటు. 
 
ఇదిలావుంటే ఈఏడాది సినీ ఇండస్ట్రీకి షాక్ ల మీద షాకులు తగులుతూనే వున్నాయి. ఇటీవల బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ ఆతరువాత రిషి కపూర్ కన్నుమూశారు అలాగే కొద్దిరోజుల ముందు ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు, కన్నడ స్టార్ హీరో చిరంజీవి గుండె పోటుతో మరణించగా మూడు రోజుల క్రితం బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణం కోట్ల మందిని కంటతడిపెట్టించింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ సచి రూపంలో మరో దెబ్బ తగిలింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: