మెగా అభిమానులు నిహారికను మెగా ప్రిన్సెస్ అంటూ చాల అభిమానంగా పిలుచుకుంటారు. సినిమాల పై తనకున్న మక్కువతో నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి అనేకప్రయత్నాలు చేసింది. అయితే ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ కావడంతో ఇప్పుడు నిహారిక దృష్టి వెబ్ సిరీస్ లపై పెట్టింది. దీనితో నిహారిక హవా వెబ్ సిరీస్ లలో బాగా రాణిస్తుంది అని అందరు భావించారు.


అయితే ఎవరు ఊహించని విధంగా నిహారిక లీక్ చేసిన ఒక ఫోటో పై నిన్న అంతా ఇండస్ట్రీ వర్గాలలో మాత్రమే కాకుండా మెగా అభిమానులలో కూడ అనేక ఆసక్తికర చర్చలు జరిగాయి. నిహారిక పెళ్ళి పై గతంలో అనేక గాసిప్పులు వచ్చాయి. ఆమె ఒక యంగ్ హీరోతో ప్రేమలో ఉంది అంటూ అనేక ప్రముఖ మీడియా సంస్థలు అనేక ఆసక్తికర కథనాలను కూడ ప్రచురించాయి.


అయితే ఇలా వార్తలు వచ్చిన ప్రతిసారి ఆమె ఆవార్తలను ఖండిస్తూ వచ్చింది. అయితే నిన్న నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటోలో పరోక్షంగా తనకు పెళ్ళి జరగబోతోంది అన్నసంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు నిహారికను పెళ్ళి చేసుకునే ఆవ్యక్తి ఎవరు అంటూ నిన్నటి రోజు అంతా ఇండస్ట్రీ వర్గాలలో అలాగే మెగా అభిమానుల మధ్య అనేక ఊహాగానాలు మళ్ళీ మొదలయ్యాయి.


నిహారిక నిన్న షేర్ చేసిన స్టార్ బక్స్ కాఫీ కప్ పై ‘మిస్ నిహా’ అని రాసి ఉంది. అయితే అందులో మిస్ అనేపదాన్ని కొట్టేసి మిసెస్ అనేపదం రాసి దానికి క్వశ్చన్ మార్క్ పెట్టడంతో నిహారిక పెళ్లి ఖరార్ అయిపోయింది అంటూ మెగా అభిమానులు నిన్న అంతా తెగసందడి చేసారు. ఆమధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ నిహారికకు సంబంధాలు చూస్తున్నామని వచ్చే ఏడాది ఏప్రిల్ మే లోపు పెళ్లి అయిపోతుందని లీకులు ఇచ్చాడు. దీనితో ఆమాటలను ఆధారంగా చేసుకుని నిహారిక ఇలాంటి ఫోటో షేర్ చేసిందా లేదంటే నిహారిక పెళ్ళి నిశ్చయం అయిపోయిందా అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలోని కొందరు మాత్రం నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనేది అబద్ధం. ఆమెకు ఆల్రెడీ వరుడు ఫిక్స్ అయిపోయాడు అతడు ఎవరనే విషయం తెలియడమే ఆలస్యం అంటూ రకరకాల ఊహాగానాలు చేయడంతో నిహారిక పెళ్ళి వార్తల సందడి మళ్ళీ ఇండస్ట్రీలో సందడిగా మారింది..    ఇది ఇలా ఉండగా నిహారికను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ప్రకాశం జిల్లాలోని ఒక పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన అబ్బాయి అని వార్తలు గుప్పు మంటున్నాయి. అయితే ఈ వార్తల పై మెగా కాంపొండ్ ప్రస్తుతానికి మౌనం వహిస్తూ ఉండటంతో అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగిపోతోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: