ఈ నెలాఖరు తరువాత ఇక దేశంలో లాక్ డౌన్ ఉండబోదు అని స్పష్టంగా స్వయంగా ప్రధాని మోడీ తెలిపినట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక వచ్చేనెల నుండి దేశం యావత్తు లాక్ డౌన్ బందిఖానా నుండి బయటపడబోతోంది అన్నక్లారిటీ వస్తోంది. వాస్తవానికి రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతు భారత్ కరోనా కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 3 లోకి వెళ్ళబోతున్న సంకేతాలు వస్తున్నా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి అంటూ ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి.


ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్ష్ ఇస్తున్న లీకులు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఆశలను చిగురింప చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన అమెరికాలో వచ్చేనెల 10 నుండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ న్యూయార్క్ నగరాలతో పాటు అనేక నగరాలలో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా వార్త సంస్థ ప్రచురించిన న్యూస్ ను పేర్కొంటూ తరుణ్ ఆదర్ష్ భారత్ లో కూడ త్వరలో ధియేటర్లు ఓపెన్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.


ప్రస్తుతం తరుణ్ ఆదర్ష్ లీక్ చేసిన ఈవార్త పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం యావత్తు సినిమాలు థియేటర్లు బంద్ అయి మూడు నెలలు కావస్తోంది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో కూడ దేశంలో ఇంతకాలం ధియేటర్ల ను మూసి ఉంచలేదు అని అంటున్నారు.


ప్రస్తుతం ప్రభుత్వాలు అన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ థియేటర్స్ ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. దేశంలో జనాభా ఎక్కువగా ఉండడం కరోనా వ్యాప్తికి థియేటర్లు విద్యాసంస్థలు వాహకాలుగా మారుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం. అయితే  ప్రపంచ దేశాలను అనుసరిస్తూ ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు లిక్కర్ షాపుల నుండి అన్ని షాపులకు డోర్స్ ఓపెన్ చేసిన పరిస్థితులలో సినిమాలు మాత్రం ఏమి పాపం చేసాయి అంటూ ప్రభుత్వ వర్గాలను ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: