పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏ విధంగా ఉన్నా సరే జనాలు కచ్చితంగా సినిమాను ఆదరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్సినిమా చేసిన కూడా ఆ సినిమాను సినీ అభిమానులు సూపర్ హిట్ ను చేస్తారు. అది యూత్ లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అని చెప్పాలి. పెద్ద స్క్రీన్ మీద సినిమా ఏ విధంగా హిట్ అయినా సరే చిన్న స్క్రీన్ మీద మాత్రం సినిమా కచ్చితంగా జనాలకు నచ్చుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.ఇకపోతే  ఆయన కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల్లో ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్.. 
 

 


సినిమా బుల్లి తెరపై వచ్చినప్పుడు అందరిని ఆకట్టుకుంది.. కాని ఈ సినిమాను థియేటర్ లో మాత్రం మొదటి రోజే నెగిటివ్ టాక్ ను అందుకుంది. అయితే ,బుల్లి తెర మీద వస్తే మాత్రం కచ్చితంగా జనాలు ఒక్క సీన్ కూడా మిస్ అవకుండా చూసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు . ఈ సినిమా విషయంలో అప్పుడు పవన్  కొంచెం యువత మనసును అర్థం చేసుకొని ఉంటె ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. అలాంటివి ఏవి జరగలేదు అందుకే సినిమా ఫ్లాప్ అయింది అంటారు. ఇక ఈ సినిమాలో మాత్రం రాజకుటుంబాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్ గా, యువరాణి మనసును గెలుచుకున్న ప్రేమికుడిగా తన పాత్రకు న్యాయం చేసాడు. 
 

 

 

సినిమా కథలో ఆ పాత్రే చాలా కీలకం. ఇక ఈ సినిమాలో విలన్ నటన హైలెట్ అని చెప్పాలి.. ఈ సినిమా కథ విషయంలో కొన్ని  జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేది కాదు అని మెగా అభిమానులు ఇప్పటికీ అంటున్నారు. ఇక ఈ సినిమా కథ విషయంలో తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు అనే ప్రచారం జరిగింది.ఇకపోతే ప్రస్తుతం హిందీ రీమేక్ చిత్రంగా రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు.. భారీ అంచనాలతో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: