మెగా డాటర్​ నిహారికకు కాబోయే భర్తెవరో తెలిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తానే స్వయంగా ఇన్​స్టా వేదికగా పోస్ట్​ చేసింది. అతనెవరో, ఏం చేస్తుంటారో తెలుసుకోవాలని ఉందా! అయితే స్టోరీ చదివేయండి.

IHG

 

మెగా బ్రదర్​ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు, సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించి నిహారిక చిన్న క్లూ ఇవ్వడం సహా.. కాబోయే వ్యక్తితో దిగిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ముఖం మాత్రం కనపడకుండా అటువైపు తిప్పి ఉండటం వల్ల ఎవరై ఉంటారా? అని మెగా అభిమానులంతా నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో మరో పోస్ట్ పెట్టిన నిహారిక అతనెవరో రివీల్​ చేసింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

NisChay 💜

A post shared by chaitanya Jv (@chaitanya_jv) on

 

 అబ్బాయి ఎవరంటే.. 

 

అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. గుంటూరులోని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడని సమాచారం. చైతన్య హైదరాబాద్​లోని ఓ ఎంఎన్​సీ కంపెనీలో పని చేస్తున్నాడట. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం వల్ల.. నిహారిక, చైతన్య రెండు మూడు సార్లు కలిసి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

 

ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత.. పెళ్లికి అంగీకారం తెలిపారని సమాచారం. ఆగస్టులో నిశ్చితార్థం ఉండొచ్చని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. ఇన్ని రోజుల సస్పెన్స్  తర్వాత ఇప్పటికీ మెగా డాటర్ పెళ్లి విషయంలో  ఒక క్లారిటీ వచ్చింది. అభిమానుల్లో చాలా చాలా సందేహాలు నడుమ ఎలాంటి వాడు వస్తాడు అని, ప్రేమ వివాహమా ? , పెద్దలు కుదిర్చిన వివాహమా ? అని అనేక సందేహాలు ప్రశ్నల ప్రవాహం మధ్యన ఒక చిరు మాటతో అని సందేహాలు తొలగిపోయాయి. అప్పుడే అభిమానుల్లో సందడి కోలాహలం మొదలైంది. వరుడు  సూపర్ అంటూ కామెంట్లు నదీ ప్రవాహం వలె పొంగిపొర్లుతున్నాయి. నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు కొత్తగా మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: